రోగనిరోధకశక్తి పెంపొందటంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా పుణ్యమాని అందరికీ పోషకాహారం మీద శ్రద్ధ బాగానే పెరిగింది. విటమిన్ సి, విటమిన్ డి రోగనిరోధకశక్తిని, ప్రొటీన్ కణజాల నిర్మాణం, కణజాల మరమ్మతులో పాలు పంచుకుని వైరస్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పోరాడేలా శరీరానికి శక్తినీ ప్రసాదిస్తుంది.యాంటీబాడీలను, రోగనిరోధక కణాలను తయారు చేసుకోవటానికి రోగనిరోధక వ్యవస్థ ప్రొటీన్ మీదే ఆధారపడుతుంది. బాడీలో కొద్దిగా పొట్రీన్ తగ్గినా బలహీనత, నిస్సత్తువ ఆవహించేస్తాయి. కాబట్టే ఆహారంలో పప్పులను విధిగా చేర్చుకోవాలని నిపుణులు […]