ఐఆర్‌సీటీసీ (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి కేరళకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది … పూర్తి వివరాలు . ।
కేరళ అందాలు చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి కేరళ ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) టూర్ ప్యాకేజీ ప్రకటించింది. మ్యాజిక్ ఆఫ్ మలబార్ (Magic of Malabar) పేరుతో ఫ్లైట్ 2023 డిసెంబర్ 11 నుండి టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఫ్లైట్‌లో పర్యాటకుల్ని కేరళ తీసుకెళ్లి, అక్కడి అందాలు చూపించనుంది. టూర్ ప్యాకేజీలో కన్నూర్, వాయనాడ్, గురువాయుర్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.
Day 1 :- మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 11 ఉదయం 6.15 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 8.30AM గంటలకు కన్నూర్ చేరుకుంటారు. హోటల్‌కి చేరుకున్న తర్వాత యాంజెలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియం, ఎరిమల (ezhimala view point) వ్యూపాయింట్ చూడొచ్చు. రాత్రికి కన్నూర్‌లో బస చేయాలి.
Day 2 :- రెండో రోజు వాయనాడ్ బయల్దేరాలి. బనసుర సాగర్ డ్యామ్, అంబలవయల్ హెరిటేజ్ మ్యూజియం చూడొచ్చు. రాత్రికి వాయనాడ్‌లో బస చేయాలి.
Day 3 :- మూడో రోజు వాయనాడ్ లోకల్ టూర్ ఉంటుంది. కురువా ఐల్యాండ్, తినెల్లి ఆలయం చూడొచ్చు. రాత్రికి వాయనాడ్‌లో బస చేయాలి.
Day 4 :- నాలుగో రోజు లేక్, లక్కిడి వ్యూపాయింట్ చూడొచ్చు. ఆ తర్వాత కోజికోడ్‌లో బెయ్పోరె బీచ్ చూడొచ్చు. ఆ తర్వాత గురువాయుర్ బయల్దేరాలి. రాత్రికి గురువాయుర్‌లో బస చేయాలి.
Day 5 :- ఐదో రోజు గురువాయుర్ ఆలయ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం మెరైన్ వాల్డ్ అక్వేరియం చూడొచ్చు. రాత్రికి గురువాయుర్‌లో బస చేయాలి. ఆరో రోజు అతిరపల్లి వాటర్‌ఫాల్స్ చూడొచ్చు. ఆ తర్వాత కొచ్చి బయల్దేరాలి. కొచ్చిలో మెరైన్ డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రి 11.55 గంటలకు కొచ్చిలో ఫ్లైట్ ఎక్కితే అర్ధరాత్రి 1.25 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.27,100, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.28,150, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.24,000 చెల్లించాలి.
ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్స్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి