సర్ప దోషాలను భస్మం చేసే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి( Visit Kukke Subramnya Swami )

కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తే సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.

ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి వాహనం గా వేలాది దాన్ని చేతబూని దేవత సైన్యానికి సేనానిగా వ్యవహరిస్తున్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం, అన్న విగ్నేశ్వరుని తో కలిసి అనేక యుద్ధాలు చేశారు. దక్షిణ భారతదేశంలో షణ్ముఖుడిగా పిలవబడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనేక ఆలయాలు కలవు. వీటిల్లో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం.

కర్నాటక రాష్ట్రము నందు, ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య), అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.

మొదటిగా మనము ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం గురించి తెలుసుకుందాము.

కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమల్లో ప్రకృతి మధ్య దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కే గ్రామంలో గల దివ్య క్షేత్రంలో శ్రీ స్వామి వారు నాగులకు రక్షణగా ఉండి అశేష భక్తులకు అవయవాలు ఇస్తూ ఉన్నారు.

పురాణచరిత్ర…

సుబ్రహ్మణ్య స్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేసి సంహరిస్తారు. యుద్ధానంతరం, ఇక్కడ విశ్రమించిన స్వామి వారు తన వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రం చేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కే సుబ్రహ్మణ్య ఒకటి కావడం విశేషం.

నాగోల్లో అగ్రగణ్యుడైన వాసుకి క్షీరసాగర మధన సమయంలో చిలక టానికి ఉపయోగించే తాడు లా మారి దేవతలకు సహాయం చేశాడు. అనంతరం గరుత్మంతుడు బాధ నుంచి తమకు విముక్తి కావాలని పరమేశ్వరునికి ఘోర తపస్సు చేస్తాడు. వాసుకి తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు అతని కోరిక తీర్చడానికి మునీశ్వర స్వామి వారిని పంపించాడు. స్వామి వారు ఈ కుక్కే ప్రాంతంలో గరుక్మంతుడు బాధనుండి నాగులకు రక్షణ ఉంటుంది అని అభయమిస్తాడు. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రహ్మణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.

కుమారధారలో పుణ్యస్నానాలు

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.

ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు.

కర్ణాటక రాజధాని బెంగళూరు కు 278 కి.మీ. దూరంలో మంగళూరు వెళ్లే దారిలో ఉంది. మంగళూరు నుంచి 100 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు విమానాశ్రయం నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు. బెంగుళూరు, మంగళూరు నుంచి బస్సు సౌకర్యముంది. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లే రైళ్లు “సుబ్రహ్మణ్య రోడ్ (స్టేషన్ కోడ్ – SBHR)” మీదుగా వెళుతాయి.