మునగాకు తింటే ఎముకలు బలంగా మారతాయా ??

మునగాకు తింటే ఎముకలు బలంగా మారతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆహారం చక్కగా జీర్ణమవుతుంది…. ఇలా ఈ ఆకు వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

* మునగాకులో బీటాకెరొటిన్‌ దండిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

* ఈ ఆకుల నుంచి ఇనుము పుష్కలంగా లభిస్తుంది. కూర, పప్పు, వేపుడు, పొడి… ఇలా వివిధ రకాలుగా మునగాకును ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత సమస్య ఎదురుకాదు.

* పాలతో పోలిస్తే మూడొంతుల క్యాల్షియం ఇందులో అధికంగా ఉంటుంది. 100 గ్రాముల మునగాకు నుంచి దాదాపు నాలుగు వందల మైక్రోగ్రాముల క్యాల్షియం అందుతుంది. దీన్ని పొడిలా, కూరల్లో వేసుకుని తీసుకుంటే ఎముక సంబంధ సమస్యలు తలెత్తవు.

* మునగాకులోని కొన్ని రసాయనాలు రక్తనాళాలు గట్టిగా మారకుండా చూస్తాయి. వీటిలో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను తగ్గించే ఔషధగుణాలుంటాయి.

* దీనిలోని పీచు ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు కొవ్వును బయటకు పంపేస్తుంది. కాబట్టి ఊబకాయులు తమ ఆహారంలో దీన్ని చేర్చుకోవచ్చు

ఈ ఆకుల్లో విటమిన్‌-సి కూడా మెండుగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

* వీటిలోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. పీచు రక్తస్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. మధుమేహులు ఎక్కువగా తీసుకుంటే మంచిది. మలబద్ధకంతో బాధపడేవారు ఈ ఆకులను తరచూ తీసుకుంటే సమస్య తగ్గుతుంది.

* మునగలోని ఫైటోకెమికల్స్‌, పాలీఫినాల్స్‌ శరీరంలోని మలినాలను బయటకు పంపించి రక్తంలోని ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి.