నోరూరించే చికెన్ మంచూరియా తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం
కావాల్సిన పదార్ధాలు:
- చికెన్
- క్యాప్సికమ్
- ఉల్లిగడ్డ
- పచ్చిమిర్చి
- వెల్లుల్లి
- మైదా
- కారం
- కశ్మీరీ కారం
- కార్న్‌ఫ్లోర్
- ఉప్పు
- నూనె
- టమోటా సాస్
- సోయాసాస్
- చిల్లీ సాస్
తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను బాగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి.
తరువాత చికెన్‌లో రెండు టేబుల్‌స్పూన్‌ల మైదా వేసుకుని బాగు కలుపుకోవాలి. ఇప్పుడు మంచి కలర్‌కోసం మనం కశ్మీరీ కారాన్ని , స్పైస్‌గా ఉండటం కోసం కారాన్ని వేసుకోవాలి.
చికెన్ మంచురీయాలో అల్లం పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఉప్పు కూడా వేసుకుని చికెన్‌ను కలపాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ను ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకోవాలి.
చికెన్ తో చేసే ఏ రెసిపీ అయినా సరే మ్యారినేట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. రెండు టేబుల్‌స్పూన్‌ల కార్న్‌ఫ్లోర్ ను నీటిలో కలుపుకుని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకోవాలి. ఇందులో చికెన్ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నూనెలో బాగా వేగిని చికెన్ పీస్‌లను వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలను , పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డలను బాగా వేపుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమోట, చిల్లీ, సోయా సాస్‌లను వేసుకుని బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి… వేడి వేడి చికెన్ మంచూరియా రెడీ.