ఒంటి గంట వరకు శ్రీశైలం మల్లన్న దర్శనం

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం దర్శన వేళలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మారుస్తూ ఈరోజు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మగబిడ్డకు జన్మనిచ్చిన రిచా గంగోపాధ్యాయ

మగబిడ్డకు జన్మనిచ్చిన రిచా గంగోపాధ్యాయ ‘లీడర్‌’ చిత్రంతో తెలుగుతెరకు రిచా గంగోపాధ్యాయ్‌ నటిగా పరిచయమయ్యారు. ఆమె ‘నాగవల్లి’, ‘మిరపకాయ్‌’, ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించారు. ‘మిర్చి’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2013లో ‘భాయ్‌’ సినిమా తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లారు. అక్కడ బిజినెస్‌ స్కూల్‌లో జోను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె నటనకు దూరమయ్యారు. Richa Gangopadhyay HQ Gallery మే 27న […]

ఏపీ మందు బాబులకు శుభవార్త చెప్పిన హైకోర్ట్..

ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి వచ్చేటప్పుడు కొంతమంది చాటుగా మద్యం బాటిల్స్ తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు ఒక్క మద్యం బాటిల్ తో ప్రయాణం చేసినా పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. జీవో నెంబర్ 411 ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని తెలిపింది. ఈ జీవోను అమలు చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది మందుబాబులకు […]

ఈ-పాస్‌తో పని లేకుండానే ఏపీకి వెళ్లొచ్చు

అన్‌లాక్‌-4 అమల్లో భాగంగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రహదారి మార్గంలో రాకపోకలకు స్వేచ్ఛ లభించింది. రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు తొలగాయి. ఈ-పాస్‌తో పని లేకుండానే రాష్ట్రంలోకి రావచ్చు. ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కరోనాకు పూర్వ పరిస్థితి అమలవుతోంది. దీనిలో భాగంగా సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను తొలగించారు. అయితే అక్రమ మద్యం రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘాలో భాగంగా వాహనాలను నిలిపి తనిఖీ చేస్తున్నారు.

స్వతంత్ర భారతమా? ఖండిత భారతమా?

వేద కాలం నుండి లక్షలాది సంవత్సరాలుగా మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క భవ్యమైన స్వరూపం ఇది బృహస్పతి ఆగమ శాస్త్రంలోను విష్ణుపురాణంలోను కాళిదాసు, ఆచార్య చాణుక్యుని రచనలలోనూ మన దేశపు ఎల్లలు గురించి స్పష్టంగా వర్ణించబడి ఉంది. ఇస్లాం మతం పుట్టిన తర్వాత ముస్లిం దురాక్రమణ కారులు తాము ఆక్రమించిన ప్రతిచోట ప్రజల సంస్కృతిని, దేవాలయాలను ఇతర శ్రద్దా కేంద్రాలను నాశనం చేసి ప్రజలందరినీ బలవంతంగా ముస్లింలుగా మార్చారు. ఆవిధంగా ముస్లింల ఆధిపత్యంతో క్రీ.శ. 1709 […]

ప్రజలకు మట్టి వినాయక ప్రతిమల్ని ఉచితంగా

ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథార్టీ అధికారులు హైదరాబాద్‌లో ప్రజలకు మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమల్ని ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ నెల 22న వినాయక చవితి ఉండడంతో మొత్తం 50 వేల మట్టి గణేశులను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పంచుతామని వివరించారు. ముఖ్యంగా మహానగరంలో వేల వినాయక మండపాలు ఉంటాయి. అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుల విగ్రహాలను వాడతారు. దీంతో జలకాలుష్యం పెరిగిపోతుండడంతో దాన్ని వాడకాన్ని తగ్గించేందుకు […]

ఒంగోలులో మరోసారి లాక్ డౌన్ ?

ఒంగోలులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. దీనితో కరోనా కట్టడికి అధికారులు చర్యలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఒంగోలులో మరోమారు లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు యంత్రాంగం సిద్దమైంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ సారి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని, కేవలం లాక్ డౌన్ వల్లనే కరోనాని అరికట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్‌కు సంబంధించి స్పష్ట్టమైన ఉత్తర్వులు వెలువడనున్నాయి.