Foods to Eat to Increase Fertility ప్రస్తుత రోజుల్లో జంక్ ఫుడ్, నిద్రలేమి, పార్టీలు, మద్యపానం ఇటువంటి ఎన్నో దాంపత్య జీవితానికి అవరోధం కలిగిస్తూ, సంతనం పొందలేకపోతున్నారు. దంపతుల్లో ఎటువంటి మేజర్ ఆరోగ్య సమస్యలు లేనప్పుడు ఒక్క సంవత్సరంలో సంతానం కలగడానికి ఎక్కువ
అవకాశాలున్నాయి. అందుకు ముఖ్యంగా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ, పురుషులు తీసుకొనే ఆహారం విషయంలో ఇద్దరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పుష్కలమైన పోషకాంశాలు ఉండే కొన్ని రకల ఆహారాలకు ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడం వల్ల సంతానం పొందడానికి అవకాశాలను మెరుగుపర్చుకొవచ్చు.
అరటి పండ్లు: గొప్ప విటమిన్స్ కలిగినటువంటి బెస్ట్ ఫుడ్ ఇది. ఇది ఎగ్ స్పెర్మ్ డెవలప్మెంట్ కు బాగా సహాయపడుతుంది. హార్మోనులను రెగ్యులేట్ చేస్తుంది.
దానిమ్మ: దానిమ్మలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. లోఫ్యాట్ మిల్క్ మరియు దానిమ్మ గింజలను స్మూతీగా చేసి ఉదయం తాగడం వల్ల నిడైన పోషకాలు అందుతాయి. ఇది సంతానప్రాప్తిని కలిగిస్తుంది. మేల్ ఫెర్టిలిటికి అద్భుతమైన ఆహారం.
గోరువెచ్చని నీళ్ళులో నిమ్మ రసం: ఇది మహిళల శరీరంలో టాక్సిక్ ట్రాన్ ఫ్యాట్స్ ను తొలగించడానికి జీర్ణక్రియలను శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీళ్ళులో నిమ్మ రసం ఒక స్టాండర్డ్ డిటాక్స్ ఫార్ములా.
బాదాంపప్పు : బాదంపప్పు మహిళల్లో ప్రత్యుత్పత్తికి అవసరం అయ్యే పోషకాంశాలు ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం అంధిస్తుంది. మరియు ప్రత్యుత్పత్తి గ్రంధులు యాక్టివ్ గా ఉండేలా సహాయపడుతాయి.
గుడ్లు: గుడ్లలో రెండు రకాల ముఖ్యమైన పోషకాంశాలు స్త్రీ, పురుషలలో సంతానోత్పతి ఉపకరిస్తాయు. ముఖ్యంగా గుడ్డులోని జింక్ ఇది మేల్ హార్మోన్సు పెంచడంలోబాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే విటమిన్ డి ఫీమేల్ ఫెర్టిలిటికి సహాయపడుతాయి.
తేనె: తేనెలో మంచి పోషకాలు మరియు అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉన్నందున తేనెను ఫెర్టిలిటీ ఫుడ్ గా భావిస్తున్నారు.
వెల్లుల్లి: గర్భాపొందే సమయంలో గర్భస్రావాన్ని నివారించే సెలీనియం అనే పోషకాంశం వెల్లుల్లిల్లో అధికంగా లభిస్తుంది. సెలీనియం క్రోమోజోమ్ బ్రేకేజ్ ను నివారిస్తుంది. దాంతో గర్భాపొందే సమయంలో గర్భస్రావాన్ని నివారిస్తుంది.
నట్స్: వాల్ నట్స్, బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ఫీమేల్ సెక్స్ డ్రైవ్ కు చాలా అసరం. గర్భస్రావం జరగకుండా కాపాడుతుంది.
బ్రౌన్ రైస్: వారంలో మూడు సార్లు మీ రెగ్యులర్ డైట్ లో బ్రౌన్ రైస్ చేర్చుకుంటే, బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ సంతానోత్పత్తికి చాలా అవసరం.
అవొకాడో: సంతానోత్పత్తికి అండోత్సర్గానికి మరియు సర్వికల్ మ్యూకస్ కు చాలా వసరం అయిన విటిమిన్ ఇ ని ఎక్కువగా మన శరీరానికి అవొకాడో అందిస్తుంది. పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉండి, ఇది సంతానోత్పత్తికి సహాయపడుతుంది.
దాల్చిన చెక్క: దాల్చిన చెక్క మన దేహంలొని ఇన్సులిన్ తగ్గించే శక్తి కలిగి ఉంది మరియు ఇది ఓవొలేషన్ రేట్ ను పెంచుతుంది.
కంద మరియు చిలకడ దుంపలు: చిలకడ దుంపలో పిండి పదార్దములు ఎక్కువ, పీచుపదార్దము, విటమిన్ ఎ., సి, బి 6, ఉంటాయి. ఇరాన్, కాల్సియం కొద్దిపాటి ఉండును.పేరు స్వీట్ పొటాటో అయినా దీన్నీ హారంగా తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచుతుంది.
కమలాకాయ: ముఖ్యంగా పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ, సామర్థ్యం పెంచడానికి కమలాకాయ అద్భుతంగా సహాయపడుతాయి. వీటిలో ఉండే విటమిన్స్ మహిళల్లో హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి.
పచ్చికురగాయలు: గర్భవతి ప్రతిరోజూ తినే పోషకాహారంలో ఫోలిక్ యాసిడ్ తగినంత పరిమాణంలో తప్పని సరిగా వుండాలి. ఫోలిక్ యాసిడ్ సాధారణంగా ఆచుపచ్చని ఆకు కూరలలో కావలసినంత దొరుకుతుంది.
సోయా ప్రొడక్ట్స్: సోయా ప్రొడక్ట్స్ సంబంధించిన ఉత్పత్తులు టోపు, సోయా మిల్క్ వంటి వాటిలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం చాలా ఆరోగ్యకరం.
పుట్టగొడుగులు : పుట్టగొడుగులుల్లో విటమిన్ డి, విటమిన్ బి5 ను అందిస్తుంది. తెల్లని పుట్టగొడుగులను మహిళలు తినడం వల్ల ఫెర్టిలిటి విలువలను పెంచుతుంది.
చేపలు: సీ ఫిష్ లో సాల్మన్, తున మరియు క్యాట్ ఫిష్ వీటిలో విటమిన్ డి మాత్రమే కాదు ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభ్యం అవుతాయి.
బ్రౌన్ బ్రెడ్: బ్రౌన్ బ్రెడ్ లో కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతాయి. పునరుత్పత్తిని పెంచుతాయి.
నీళ్ళు: ప్రతి రోజూ మీ శరీరానికి అవసరం అయ్యేన్ని నీళ్ళు తప్పనిసరిగా త్రాగాలి. నీళ్ళు శరీరంలోని వేడిని తగ్గిచటమే కాకుండా టాక్సిన్స్ ను తొలగించి, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ను ఉత్పత్తి చేస్తుంది.
బెర్రీస్: బ్లూ బెర్రీ మరియు రాస్బెర్రీలలో పూర్తిగా యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల సంతానోత్పత్తికి ఇది చాలా బాగా సహాయపడతుంది. బెర్రీస్ శరీరంలోని సెల్ డ్యామేజ్ నివారిస్తుంది.
మీ సుచనలు మరియు సలహాలు lifestyle@freshga.com కి Email చేయగలరు.
Like us facebook.com/freshgadotcom
Keys:A healthy diet and including nutritious foods can be of great help for infertility problems.