గాసిప్స్ : టాక్సిక్ కోసం నయనతార భారీ రెమ్యూనరేషన్..

‘టాక్సిక్’ కోసం నయనతార భారీ రెమ్యూనరేషన్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన పారితోషికాలు!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic). సినిమా విడుదలకు ముందే కథ, లుక్స్, భారీ బడ్జెట్‌తో పాటు నటీనటుల రెమ్యూనరేషన్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా ఆగస్ట్ 26న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. గతవారం హీరోయిన్ల టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా యశ్ – కియారా అడ్వాణీల రొమాంటిక్ సాంగ్ వీడియోను విడుదల చేసి సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.

నయనతార రెమ్యూనరేషన్ ఎంతంటే?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగిస్తున్నా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆమె.. ఇప్పుడు ‘టాక్సిక్’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా కోసం నయనతార భారీ పారితోషికం అందుకుంటున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.మొదట ఆమె రూ. 18 కోట్లు డిమాండ్ చేయగా, ఆ తర్వాత చర్చల అనంతరం రూ. 12 కోట్ల పారితోషికానికి అంగీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, పాత్ర ప్రాధాన్యతను బట్టి ఆమె రూ. 12 నుంచి 15 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ చిత్రంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా నిలిచారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సైతం ఏకంగా రూ. 15 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.