ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ ఎత్తైన నౌక
అత్యంత విశాలమైన స్థలం, ఈఫిల్ టవర్ కంటే ఎత్తు ఆ భారీ నౌక సొంతం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణికుల నౌక స్పెయిన్‌లోని బార్సిలోనాకు చేరుకుంది. వేసవి కాలంలో మధ్యధరా సముద్రంలో విలాసవంతమైన ప్రయాణాలు చేపట్టేందుకు దీన్ని వినియోగించనున్నారు.
ఫ్రెంచ్ నిర్మించిన 16 డెక్ భారీ నౌక అయిన దీని పేరు హార్మొనీ ఆఫ్ సీస్. ఇది 362 మీటర్లతో ఈఫిల్ టవర్ కంటే ఎత్తు ఉంటుంది. ప్రయాణికుల ఓడల్లో ఇది అత్యంత విశాలమైనది. ఇది 6,360 మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు. అత్యంత ఖరీదైన ఈ నౌకలో 2500 గదులు, 20 భోజనశాలలు, 23 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. వీటితోపాటు పది వేల మొక్కలు, 50 పెద్ద వృక్షాలతో పార్కును కూడా దీనిలో ఏర్పాటు చేశారు. ఈ నౌకను నిర్మించేందుకు రెండున్నర ఏళ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది. నౌక నిర్మాణానికి అయిన వ్యయం బిలియన్ డాలర్లు. బార్సిలోనాకు రాక ముందు బ్రిటన్‌లోని సౌత్‌ఆంప్టన్ రేవుకు గత నెల 17న ఈ నౌక చేరుకుంది.
World’s largest cruise ship, Harmony of the Seas