వర్షపాతాన్ని రెయిన్‌గేజ్ అనే పరికరంతో కొలుస్తారు. సమతల ప్రదేశంలో వర్షం కురిస్తే ఎంత ఎత్తున నీరు నిలబడుతుందో రెయిన్‌గేజ్ ఆ వర్షపాతాన్ని మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో కొలుస్తుంది. ద్రవాలను లీటర్లలో కొలుస్తారు కదా! మరి వర్షపాతాన్ని ఎందుకు మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో కొలుస్తారు? ఎందుకంటే ఏదైనా భౌతికరాశిని… దానిని ఏ ప్రమాణాల్లో కొలిస్తే సులభంగా ఉంటుందో ఆ ప్రమాణాల్లో కొలుస్తారు. ఉదాహరణకు ఒక మిల్లీమీటరు వాన పడిందంటే అర్థం.. ఆ ప్రాంతంలో ప్రతి చదరపు మీటరుకి ఒక లీటరు వంతున నీరు చేరిందన్నమాట.