విజయవాడ: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ అమ్మవారు వరలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిచ్చింది. కరోనా వైరస్ దృష్ట్యా వరలక్ష్మీ దేవి వ్రతంలో భక్తులు పాల్గొనేందుకు అనుమతిని నిరాకరించారు. ప్రతీ ఏడాది నిర్వహించే సామూహిక, ఉచిత వరలక్ష్మీ దేవి వ్రతాలు, ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.
అయితే వ్రతంలో భక్తులకు పరోక్ష పూజల ద్వారా గోత్రనామాలతో జరిపేందుకు మాత్రమే అవకాశం కల్పించారు . ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 2,3,4 వ తేదీల్లో ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.