ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో ఉంది దీనిని 1713లో విజయనగరం మహారాజు విజయరామరాజు నిర్మించాడు. విజయ నగర రాజులు దీనిని విజయానికి సంకేతంగా భావించేవారు చదరపు ఆకారంలో ఉన్నఈ కోటలో రెండు ప్రధాన ద్వారాలున్నాయి. వీటిలో ప్రధాన ప్రవేశ ద్వారం నగర్ఖానా ఈ కోట విస్తృతమైన నిర్మాణా లక్షణాలను కలిగి ఉంటుంది కోట లోపల అనేక దేవాలయాలు రాజభవనాలు ఈ విజయానికి చిహ్నంగా నిర్మించిన ఎత్తైన స్థూపం ఉన్నాయి. విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నాలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. కోట చుట్టూ 19,653 చదరపు అడుగుల కందకం తవ్వించారు. నాడు కందకం నిండా నీరు ఉండేది. ఇది సుమారు రెండు ఏనుగులు మునిగేటంత లోతు ఉంటుంది. గోడలు సుమారు 30 అడుగుల ఎత్తు కలిగివున్నాయి.