మన భారతదేశంలో పరమశివుడు కొలువుదీరిన పంచభూతలింగ క్షేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి. ఈ పుణ్యక్షేత్రంలో శివుడు ‘వాయలింగం’ రూపంలో శ్రీకాళహస్తిశ్వరుడిగా దర్శనమిస్తాడు.
పంచభూతలింగ క్షేత్రాలలోనే ఈ క్షేత్రం ఎంతో పుణ్య, గొప్ప క్షేత్రంగా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకుని, శివుడిని భక్తితో స్మరిస్తే.. చేసిన పాపాలన్నీ తొలగిపోయి, విముక్తి లభిస్తుందని వేదపండితులు కూడా నమ్ముతారు. అందువల్ల ఇక్కడికి విచ్చేసే భక్తులు కాశీ, చిదంబరం, తిరువారూరుల వంటి క్షేత్రాల కంటే ఎక్కువగా దర్శించుకుంటారు. ఈ ప్రాంతానికి, దేవాలయానికి సంబంధించి పురాణాలలో విశిష్టమైన కథలు కూడా తెలుపబడివున్నాయి.
1 comments