Varun Tej’s Valmiki Teaser, good response for valmiki teaser, Varun Tej, Pooja Hedge, Atharvaa , Harish Shankar , Pooja Hedge hot,
‘నాలుగు బుల్లెట్స్ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె, రెండు దాచుకోవాలె..’ అని వరుణ్ తేజ్ ఇంటెన్స్ లుక్ చెప్పే డైలాగ్‌తో 51 సెకండ్ల నిడివిగల వాల్మీకి టీజర్ స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న రిలీజ్ అయ్యింది. ‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ అధర్వ చెప్పే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. వరుణ్ స్టైలిష్ లుక్‌తో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నాడు. సిగరెట్ తాగుతూ వరుణ్ నడుస్తూ వచ్చే సీన్ బాగుంది. టీజర్ చూస్తుంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలువనున్నాయని తెలుస్తుంది.
టీజర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఇంట్రెస్ట్ క్రేయేట్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. వరుణ్ ఫస్ట్ మూవీ ముకుందలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే, మరొక్కసారి ఈ సినిమాలో ఆయనతో నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరుణ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సెప్టెంబర్ 13న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.