టీవీఎస్‌.. ఎన్‌టార్క్‌ 125 రేస్‌ ఎక్స్‌పీ

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ.. మార్కెట్లోకి 125 సీసీ స్కూటర్‌ ఎన్‌టార్క్‌ 125 రేస్‌ ఎక్స్‌పీ విడుదల చేసింది.


టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ.. మార్కెట్లోకి 125 సీసీ స్కూటర్‌ ఎన్‌టార్క్‌ 125 రేస్‌ ఎక్స్‌పీ విడుదల చేసింది. దీని ధర రూ.83,275 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). డ్రైవ్‌ మోడ్స్‌, వాయిస్‌ అసిస్ట్‌, కనెక్టడ్‌ టెక్నాలజీ వంటి ఫీచర్లతో తీసుకువచ్చినట్లు టీవీఎస్‌ తెలిపింది. స్కూటర్‌ విభాగంలో రేస్‌ మోడ్‌, స్ట్రీట్‌ మోడ్‌తో తీసుకువచ్చిన మొట్టమొదటి స్కూటర్‌ ఇదేనని పేర్కొంది. హైవేలపై సజావుగా ప్రయాణం సాగించేందుకు రేస్‌ మోడ్‌ దోహదపడుతుందని తెలిపింది. కాగా స్ట్రీట్‌ మోడ్‌.. నగరాల్లో ట్రాఫిక్‌ పరిస్థితులకు అనుగుణంగా సాగిపోయేలా రూపొందించినట్లు పేర్కొంది