11న నారా రోహిత్‌ ‘తుంటరి’ విడుదల

నారా రోహిత్‌, లతా హెగ్డే జంటగా కుమార్‌ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తుంటరి’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయకుడు నారా రోహిత్‌ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.  ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి ఫిల్మ్స్‌ పతాకంపై అశోక్‌, నాగార్జున్‌లు సంయుక్తంగా నిర్మించారు. సాయి కార్తీక్‌ సంగీతం సమకూర్చారు. ‘మన్‌ కరాటే’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘తుంటరి’గా తెరకెక్కించారు.

tuntari-11th