విక్రం ‘సామి 2’ త్రిష

trisha-krishna-swamy-movie-freshga

హరి దర్శకత్వంలో పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా విక్రం 2003లో నటించిన చిత్రం ‘సామి’. సూర్యతో ‘సింగం 3’ రూపొందిస్తున్న హరి ఆ సినిమా విడుదలయ్యాక.. విక్రంతో కలసి ‘సామి 2’ను తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. తొలి భాగంలో విక్రంకు జంటగా త్రిష నటించారు. ఇప్పుడు రెండో భాగంలో ఆమె నటించే అవకాశముందని తెలుస్తోంది. దీనిగురించి దర్శకుడు మాట్లాడుతూ ‘సామి 2’ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించనున్నాం. కథ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం చిత్రీకరణకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.