తెలుగు సినీ పరిశ్రమల్లో సత్తా చాటుతున్న భామలు మలయాళీ కుట్టీలు

తెలుగు సినీ పరిశ్రమల్లో ఓ రేంజిలో సత్తా చాటుతున్న భామలు మలయాళీ కుట్టీలు. తెలుగు సినీ పరిశ్రమల్లో ముంబై భామల తర్వాత ఎక్కువ మంది హీరోయిన్లు వచ్చింది కేరళ నుండే.

పెర్ఫార్మెన్స్‌లో, అందాల ఆరబోతలో తమదైన శైలిని ప్రదర్శించడం, రొమాంటిక్ సీన్స్, శృంగార సన్ని వేశాల్లో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేలా నటించడం, చాలెంజింగ్ రోల్స్ చేయడంలో ప్రత్యేకత చూపడంలో మలయాళీ భామల తర్వాతే ఇంకెవరైనా అని చెప్పక తప్పదు. నయనతార, అసిన్, ప్రియమణి, లక్ష్మీరాయ్, మమతా మోహన్ దాస్, మీరా జాస్మిన్, శ్వేతా మీనన్, సింధు మీనన్ లాంటి హీరోయిన్లను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.

1.కీర్తి సురేష్
రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్, ఆ తర్వాత నేను లోకల్ , మహానటి , అజ్ఞాతవాసి, వంటి చిత్రాల్లో నటించారు. మహానటి చిత్రంతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.

https://freshga.com/tag/keerthisuresh/

2. ప్రియామణి
రీసెంట్ గా ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చిన ప్రియమణి, మొత్తం దక్షిణ పరిశ్రమతో, మరియు హిందీ సినిమాలో కూడా పనిచేస్తుంది. 2007 లో తమిళ చిత్రం పరుతివీరన్ పాత్రలో ఆమె జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. అదే సంవత్సరంలో, ఎస్.ఎస్.రాజమౌలి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా యమదొంగలో ఆమె చేసిన కృషికి ప్రశంసలు అందుకున్నారు. ఆమె తిరకథ (మలయాళం), రక్త చరిత 2 (హిందీ), రగడ, విష్ణువర్ధన (కన్నడ), చారులత (కన్నడ) వంటి సినిమాల్లో పనిచేశారు.

3. మమతా మోహన్ దాస్ :-

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనది. ఆ తర్వాత నాగార్జున కృష్ణార్జున, నితిన్ విక్టరీ, హోమం, వెంకటేష్ చింతకాయల రవి, నాగార్జున కింగ్, కేడి చిత్రాల్లో నటించారు.