ఏపీలోకి రావాలంటే ఖచ్చితంగా ఈ-పాస్ ఉండాల్సిందే

ఏపీకి వెళ్లాలంటే పాస్ అవసరం లేదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది ఏపీ స‌ర్కార్.. ఎవరైనా ఏపీలోకి రావాలంటే ఖచ్చితంగా ఈ-పాస్ ఉండాలని స్ప‌ష్టం చేస్తున్నారు అధికారులు. 

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించిన అధికారులు.. ఏపీకి వచ్చే వారు తప్పనిసరిగా స్పందనలో దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. ఇత‌ర ప్రాంతాల నుంచి ఏపీకి వ‌చ్చేవారిపై ఆంక్షలు కొనసాగుతాయని.. దీనిపై ప్రభుత్వ నుంచి నిర్ణయం వచ్చే వరకు పాత నిబంధనలే అమల్లో ఉంటాయ‌ని చెబ‌తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఏపీకి వ‌చ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. ఈ- పాస్ ఉన్నా.. ఆధార్ నెంబర్, చిరునామాను నమోదు చేసుకున్న తర్వాతే రాష్ట్రంలోకి అనుమ‌తి ఉంటుంది.. ఇక‌, అనుమానం ఉన్నవారికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి. ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. పాస్ ఉన్నా సరే.. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 వ‌ర‌కే ఏపీలోకి అనుమ‌తి ఇస్తారు.. ఆ  తర్వాత అత్యసవరమైతే త‌ప్ప అనుమ‌తి ఉండ‌దు అంటున్నారు ఏపీ అధికారులు.