జమ్మూకశ్మీర్‌లోని బారాముల్ల జిల్లా సోపోర్ పట్టణంలో ఆదివారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేయగా అప్రమత్తమైన భద్రతా దళాలు జరిపిన సుదీర్ఘ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
ఈ దాడిలో ఒక ఉగ్రవాది పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద గ్రూపునకు సంబంధించిన ఉస్మాన్‌గా గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
రెండు వారాల క్రితం, నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు బారాముల్లా జిల్లాలోని ఉరిలోని ఒక సైనిక స్థావరంలోకి చొరబడి 19 మంది సైనికులను చంపారు.
ఉరి దాడి జరిగినప్పటి నుండి భద్రతా దళాలు తీవ్ర అప్రమత్తంగా ఉన్నాయి.
గత వారం గురువారం, జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రదేశాలపై దాడి చేయాలనే లక్ష్యంతో, భారతదేశంలోకి చొరబడటానికి వేచి ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల బృందాలపై నియంత్రణ రేఖ మీదుగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు తెలిపింది.
దాడి చేసిన వారు జీలం నది మీదుగా భారతదేశంలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. దాడి తరువాత బారాముల్లాలో భద్రతా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. కాల్పులు ఆగిపోయాయని పరిస్థితి “నియంత్రణలో ఉంది” అని సైన్యం తెలిపింది.