బుల్లితెర ప్రేక్షకులను అలరించే రియాల్టీ షో బిగ్‌బాస్ త్వరలోనే ఐదో సీజన్ ప్రారంభంకానుంది. తెలుగులో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్.
ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ‘బిగ్‌బాస్’ టీం సర్ప్రైజ్ ఇచ్చింది.కింగ్ నాగార్జున మాస్ ఎంట్రీతో తీర్చిదిద్దిన ఈ ప్రోమోను శనివారం విడుదల చేసింది. ‘చెప్పండి బోర్‌డమ్‌కు గుడ్‌బై.. వచ్చేస్తోంది బిగ్‌బాస్ సీజన్-5’ అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
మరి సీజన్-5లో ఎవరెవరు కంటెస్టెంట్లుగా ఉంటారు? ప్రేక్షకులను ఎలా అలరిస్తారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటివరకూ ఈప్రోమో చూసేయండి.