శ్రుతి పాట కు.. తమన్నా ఆట

కథానాయికగా, గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రుతిహాసన్‌, విశాల్‌, తమన్నా జంటగా సూరజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’ చిత్రంలోని ఓ పాటను  ఆలపించనున్నట్లు సమాచారం. ఈ పాటను తమన్నాపై షూట్‌ చేయనున్నారట. విశాల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 29న చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. జి. హరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హిప్‌ ఆప్‌ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబరు 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వస్తుంది.