త్రిష ‘నాయకి’కి ముఖ్య అతిథిగా బాలకృష్ణ

గిరిధర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై త్రిష కథానాయకిగా గొవి  దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నాయకి’ చిత్రం ఆడియోను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీలో నిర్వహించనున్న ఈ ఆడియో విడుదల వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. చిత్ర దర్శకుడు గొవి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ… సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.