ఒంగోలులో మరోసారి లాక్ డౌన్ ?

ఒంగోలులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. దీనితో కరోనా కట్టడికి అధికారులు చర్యలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఒంగోలులో మరోమారు లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు యంత్రాంగం సిద్దమైంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ సారి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని, కేవలం లాక్ డౌన్ వల్లనే కరోనాని అరికట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్‌కు సంబంధించి స్పష్ట్టమైన ఉత్తర్వులు వెలువడనున్నాయి.