కోసలరాజ్యానికి రాజధాని, దశరథుడి రాజ్యసభ, రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం, సరయు నది తీరంలో ఉన్న పట్టణం, శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. ఎన్నో ఉద్యమాలు, సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి పోరాట చరిత్రను పరిశీలిద్దాం. పురావస్తు పరిశోధన:పురావస్తు పరిశోధన శాఖ జరిపిన విస్తృతమైన […]