సుజుకీ మోటార్స్ ఇండియా 125 స్కూటర్ బర్గ్‌మన్ ధరను పెంచింది. స్టాండర్డ్ వేరియంట్, స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ ధరలు రూ.1,600 వరకు పెంచినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త ధరల ప్రకారం బర్గ్‌మన్ స్టాండర్డ్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.84,300, ఇక స్ట్రీట్ రోడ్ కనెక్ట్ వేరియంట్ ధర రూ.87,800గా నిర్ణయించారు. దీంతో 125 సీసీ స్కూటర్ విభాగంలో అత్యధిక ధర ఉన్న వాహనాల్లో ఇది కూడా ఒకటిగా మారింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈ మార్పులుచేయాల్సి వచ్చింది.
మ్యాక్సీ స్కూటర్ డిజైన్లో వచ్చిన బర్గ్‌మన్‌లో 124 సీసీ టూవాల్వ్, సింగిల్ సిలెండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8.6 బీహెచ్‌పీ శక్తిని, 10 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ వాహనం స్ట్రీట్ రైడ్ కనెక్ట్ వెర్షన్‌లో బ్లూటూత్, టర్న్ బై టర్న్‌నావిగేషన్, కాల్, ఎస్‌ఎంఎస్, వాట్సప్ అలర్ట్‌లు వచ్చే విధంగా తీర్చిదిద్దారు. దీనిలో సౌకర్యవంతమైన పెద్ద ఫుట్‌బోర్డు ఇచ్చారు. ఈ వాహనం కెర్బ్ వెయిట్ 110 కిలోలు.