Suriya Samantha Nithya Menen 24 Latest Trailer

Suriya Samantha Nithya Menen 24 Latest Trailer

సూర్య హీరోగా ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘24′. 2డి ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు గ్లోబల్ సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2016 మోస్ట్ ఎవేటెడ్ మూవీగా కధాకధనాలతో పాటు సాంకేతికంగా హై స్టాండర్డ్స్ లో వస్తోన్న  ‘24’ చిత్రానికి సంబంధించిన పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. సమంత, నిత్య మేనన్‌ కథానాయికలు.  తొలిసీడీని ప్రముఖ కథానాయకుడు కార్తి ఆవిష్కరించారు. సురేష్‌బాబు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ అందుకొన్నారు. ప్రచార చిత్రాన్ని అఖిల్‌ విడుదల చేశారు.