శ్రీశైలంలో వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేత..

శ్రీశైలం దేవాలయంపై కరోనా ఎఫెక్ట్ పడింది. అక్కడ కేసులు ఎక్కువ కావడంతో పాటు ఆలయ అర్చకులు ఇతర సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజల పాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వీటికి సంబంధించి అదుపులోకి వచ్చిన తరువాతే తిరిగి దర్శనాలను పున:ప్రారంభిస్తామని ఆలయ ఈవో రామారావు తెలిపారు.

శ్రీశైలంలో కొంత మంది ఉద్యోగులతోపాటు పనిచేసేవారికి కరోనా పాజిటివ్ రావడంతో ఆలయంలో స్వామిఅమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో భక్తులు లేకుండా యధావిధిగా నిత్యకైంకర్యాలు పూజలు, పరోక్ష సేవలను కొనసాగిస్తామని ఈవో కేఎస్ రామారావు తెలిపారు.