Sri Vaishno Devi Shakti Peeth
Temple History Travel Information Accommodation
అష్టాదశ శక్తిపీఠాల్లో 15 వ శక్తిపీఠం శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం.
శ్రీ వైష్ణవీదేవి ఆలయం జమ్మూనగరంకు 60 కి. మీ దూరంలో కాలధరము అనే పర్వత ప్రాంతంలో ఉంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి హిమాచల ప్రదేశ్ లోని జ్వాలాముఖి 82 కి.మీ లు. పఠాన్ కోట్ నుంచి రైలు సౌకర్యం ఉంది. జంబూ అన్న పదము కాలక్రమంలో జమ్ముగా మారినది. జమ్మూ నుంచి కత్రా కు 13 కి .మీ కాలినడకన ప్రయాణించి శ్రీ వైష్ణవి దేవి గుడికి వెళ్ళవచ్చు.
ఇక్కడ సతీదేవి శిరస్సు పడిన ప్రదేశంగా చెపుతుంటారు. అమ్మ
శిరస్సు పడిన శక్తిపీఠము కనుక జ్ఞాన క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారిని జ్వాలాముఖీశ్వరి అని,జ్వాలాజీ,మాతా రాణి అని ఆరాధిస్తారు. ఇక్కడ వైష్ణవీ అమ్మవారు జ్వాల (మంట) రూపంలో ఉంటారు. గర్భగుడి మధ్యలో ఉన్న కుండలో రెండు వైపుల నుంచి మంట వస్తూ ఉంటుంది. జ్వాల రూపంలో ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారిని మహాకాళీ,మహాలక్ష్మి,మహాసరస్వతి రూపంలో భక్తులు పూజిస్తారు. జ్వాలాముఖీదేవి గర్భగుడికి చిన్న ప్రవేశ ద్వారం ఉంటుంది. ఈ ద్వారం నుండి తలను దూర్చి చూస్తే అమ్మవారి దర్శనం బాగా జరుగుతుంది. అమ్మవారి ప్రక్కనే 40 అడుగుల త్రిశూలం కలదు. భక్తులు గూటిలోపల తలపెట్టి రాధేశ్యామ్ అని ఎంత గట్టిగా అరిస్తే లోపలి జ్వాల అంత బాగా వెలుగుతుంది.
ఈ ప్రాంతంలో కాలధరము అనే పర్వతం ఉంది. ఈ పర్వతం పై సతీదేవి నాలుక నిలువుగా పడింది. అందువల్ల అప్పటినుండి అగ్నిజ్వాల బయటకు వచ్చుచున్నది. ఈ అగ్నిజ్వాలానే జ్వాలాముఖీ అని పిలుస్తారు. అమ్మవారి దర్శనార్థం కోసం సంవత్సరం పొడవునా భక్తులు వస్తుంటారు.