ఇది కరోనా స్పెషల్‌ టీ’

కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో వినూత్న వ్యాపారాలు జోరందుకున్నాయి. కొంతమంది మాస్కులు, ఫేస్‌షీల్డులు, కషాయాలు విక్రయించి లాభాలు అర్జిస్తున్నారు. వరంగల్‌లోని హన్మకొండకు చెందిన ఓ టీషాపు యజమాని ‘కరోనా స్పెషల్‌ టీ’ని విక్రయించాలనే వినూత్న ఆలోచన చేశాడు.  

హన్మకొండలోని రామ్‌నగర్‌ వద్ద ఓ వ్యక్తి టిఫిన్‌ సెంటర్‌ను నడిపేవాడు. కరోనా నేపథ్యంలో అల్లం, దాల్చినచెక్క, ఇతర పదార్ధాలను ఉపయోగించి అతను చాయ్‌ తయారు చేస్తున్నాడు. పొద్దున్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఈ టీ తాగి ఉపశమనం పొందుతున్నట్లు తెలుపుతున్నారు. ఈ టీ తాగితే గొంతులో నొప్పి, జలుపు తగ్గుతుందని, టీ షాపు యజమాని పరిశుభ్రత పాటిస్తూ విక్రయిస్తాడని వారు తెలిపారు. 

రూ.10కి విక్రయిస్తున్న ఈ కరోనా స్పెషల్‌ టీకి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీని రుచి చూసిన వారు తిరిగి దూరప్రాంతాల నుంచి వచ్చి మరీ తాగుతున్నారని యజమాని పేర్కొన్నాడు. అంతకుముందు రోజుకు 50 టీలు అమ్ముడు పోగా ప్రస్తుతం 600 టీలు విక్రయిస్తున్నట్లు టీ షాప్‌ యజమాని తెలిపాడు.