‘సరైనోడు’ సెన్సార్ పూర్తి ఏప్రిల్ 22 న ప్రేక్షకుల ముందుకు

గీతా ఆర్ట్స్ పతాకం పై  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘సరైనోడు’. బన్నీ సరసన కేథరిన్ తెరిసా, రకుల్ ప్రీత్ సింగ్ లు జంటగా నటిస్తుండగా.. మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురువారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ‘యూ/ఏ’ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే నేరుగా ఆన్లైన్ లో విడుదలైన  గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏప్రిల్ 10న వైజాగ్ లో ఈ చిత్ర బృందం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ పతాకం పై నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.