సప్తనదీ సంగమేశ్వరాలయం నీటిలో

శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతుండటంతో కర్నూలు జిల్లాలోని సప్తనదీ సంగమేశ్వరాలయం నీటిలో మునిగిపోతోంది.

సోమవారం సాయంత్రానికి సంగమేశ్వరం దిగువ ఘాట్‌ వరకు చేరిన నదీ జలాలు, మంగళవారం సాయంత్రానికి ఆలయ ఆవరణలోకి ప్రవేశించాయి. ఇదేస్థాయిలో ప్రవాహం కొనసాగితే బుధవారం తెల్లవారేసరికి గర్భాలయంలోని శివలింగం నీటమునిగే అవకాశం ఉంది. క్షేత్ర వేదపండితుడు తెలకపల్లి రఘురామశర్మ ఆలయంలో అంత్య పూజలు నిర్వహించారు.