ఎన్టీఆర్‌ను దాటేసిన సమంత..!

త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత నితిన్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అ ఆ’ మరో రికార్డు క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ మార్క్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్ కలెక్షన్లలో ‘బాహుబలి’ టాప్‌ వన్‌లో ఉండగా.. మహేశ్ ‘శ్రీమంతుడు’ సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. టాప్‌ త్రీలో ఉన్న ‘నాన్నకు ప్రేమతో’ ఉన్న చిత్రాన్ని నితిన్ ‘అ ఆ’ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సినిమాల ఫస్ట్‌వీక్ కలెక్షన్లను పరిశీలిస్తే… తొలి వారాంతానికి ‘బాహుబలి’ 4.4 మిలియన్ డాలర్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉండగా, 2.09 మిలియన్ డాలర్లతో శ్రీమంతుడు రెండో స్ధానంలో నిలిచింది. 1.7 మిలియన్ డాలర్లతో ‘అ ఆ’ ఆ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 1.63 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్న నాన్నకు ప్రేమతో, 1.52 మిలియన్ డాలర్లతో అత్తారింటికి దారేది లాంటి స్టార్ హీరోల సినిమాలను దాటి ‘అ ఆ’ వసూళ్లు సాధించటం ట్రేడ్ పండితులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో నితిన్ కెరీర్‌లోనే ఇదో బ్లాక్ బస్టర్ సినిమాగా చెప్పుకోవచ్చు అంటున్నారు సినీజనం.

 

A Aa movie distributed by Blue Sky premiered in over 130 screens in North America on Wednesday. In the U.S. box office, it had collected  $266,729 for the premiere shows. This film is the fourth biggest opener among the latest Telugu films in 2016, after Sardar Gabbar Singh, Brahmotsavam, and Nannaku Prematho. All over the country it was released in 200 screens. A Aa movie is the first movie to cross the $1 million at the U.S.box Movie office. And the chemistry between Nithin and Samantha had been worked well in the movie.