14న ‘సుప్రీమ్’ పాటలు విడుదల

ఈ వేసవిలో మరో మెగా హీరో సందడి చేయబోతున్నాడు. ఈ నెల 8న పవన్ ‘సర్దార్‌’గా ఎంట్రీ ఇస్తే 22న ‘సరైనోడు’గా అల్లు అర్జున్ తెరమీదికి రానున్నాడు. వీరితోపాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ సైతం ‘సుప్రీమ్’గా ఈ వేసవిలో అలరించనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించారు. ‘దిల్’ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా నాయికగా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సాయి కార్తీక్ సంగీతమందించిన పాటలు ఈ నెల 14న శిల్పకళావేదికలో విడుదల కానున్నాయి.

Supreme mass.. one more Sai Dharam Tej still..stay tuned for audio event…on Apr 14th .. SUPREME – DON’T SOUND HORN

Posted by Anil Ravipudi on Monday, April 11, 2016