సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదల

సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదల

సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదలైంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్‌తో జోష్‌లో ఉన్న సాయిధరమ్‌తేజ్‌, పటాస్ సక్సెస్‌తో మంచి ఊపు మీదున్నఅనీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సుప్రీమ్ చిత్రం మీద మంచి అంచనాలే వున్నయి. సాయికార్తీక్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. చిరంజీవి తల్లి అంజనాదేవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, హీరో నాని ముఖ్య అతిథులుగా హాజరై సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్రం బృందంతో పాటు హీరోలు వరుణ్‌తేజ్‌, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీశ్‌ శంకర్‌, గోపీచంద్‌ మలినేని తదితరులు హాజరయ్యారు.

.

Supreme Theatrical Trailer :- 

 

.

అనిల్‌  ‘పటాస్’ సినిమాలో అరె వో సాంబ సాంగ్ ని రీమిక్స్ చేసినట్లుగానే, సుప్రీమ్ సినిమాలో కూడా చిరంజీవి నటించిన యముడుకు మొగడు చిత్రంలోని అందం హిందోళం, అధరం తాంబూళం అనే పాటను రీమిక్స్ చేసారు. ఈ పాటలో కోరస్ సుప్రీమ్ హీరో అని వస్తుంది కాబట్టి టైటిట్ కు తగినట్లు పాట ఉండాలని రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో ఆటో డ్రైవర్‌గా కనిపించనుండగా, రాశీఖన్నా పోలీస్ ఆఫీసర్‌గా అలరించనుంది.

Supreme Audio Launch full:-