మగబిడ్డకు జన్మనిచ్చిన రిచా గంగోపాధ్యాయ

‘లీడర్’ చిత్రంతో తెలుగుతెరకు రిచా గంగోపాధ్యాయ్ నటిగా పరిచయమయ్యారు. ఆమె ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించారు. ‘మిర్చి’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2013లో ‘భాయ్’ సినిమా తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లారు. అక్కడ బిజినెస్ స్కూల్‌లో జోను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె నటనకు దూరమయ్యారు.
మే 27న తనకు మగబిడ్డ పుట్టాడని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బాబుకి ‘లుకా షాన్’ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు.