గుమ్మాలకు మామిడి తోరణాలు ఎందుకు కట్టాలి?

గుమ్మాలకు మామిడి తోరణాలు ఎందుకు కట్టాలి?

సాధారణంగా పండగలు, వేడుకలకు తోరణాలు కడుతుంటాం.
 ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండుగలు నిర్వహించరు. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు.శుభకార్యాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణమే. 
మామిడి కోరికలను తీరుస్తుందని భావిస్తారు. పర్వదినాల్లో, యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.