ప్రస్తుతం ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో కూడా కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఓ దగ్గర ఉండాల్సిన పరిస్థితి. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందాల బామ రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ కు మకాం మార్చిందట. రకుల్‌ప్రీత్ సింగ్ సినిమాలే కాకుండా ప్రత్యామ్నాయ వ్యాపారాల్లో కూడా ఉన్నవిషయం తెలిసిందే. హైదరాబాద్ లో సొంతంగా జిమ్ ట్రైనింగ్ సెంటర్ ను నిర్వహిస్తోంది. మరోవైపు వైజాగ్ లో కూడా ఫిట్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుంది.