మూడు నెలల తర్వాత తెరుచుకోనున్న పూరీ ఆలయం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయం మూడు నెలల తర్వాత తెరుచుకోనుంది. కొవిడ్‌ నిబంధలను లోబడి మూడు నెలలుగా ఆలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.

రథ యాత్ర సమయంలోనూ కొవిడ్‌ దృష్ట్యా కొంతమందితోనే నిర్వహించారు. తాజాగా ఈ ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని దశల వారీగా కల్పిస్తామని ఆలయ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. దర్శన నిమిత్తం ఆగస్టు 23 నుంచి భక్తులకు ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నారు.

ఆగస్టు 16 నుంచి సింహద్వారం నుంచి భక్తులను ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. అయితే భక్తులు కొవిడ్‌ టీకా సర్టిఫికెట్ లేదా 96 గంటల ముందు టెస్ట్‌ చేయించుకున్న నెగిటివ్ ఆర్‌టీపీసీఆర్‌ రిపోర్టును చూపించాలి. వారితోపాటు ఆధార్‌కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలి.

పూరీ జగన్నాథుని ఆలయంలో అంతుచిక్కని రహస్యాలివే