టెక్నాలజీ మారే కొద్ది అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి. సీజన్‌లో దొరకాల్సిన పండ్లు, కూరగాయలు అన్ని వేళలా దొరుకుతున్నాయి. దొరికేలా పండిస్తున్నారు. మరి సీజన్ పోయిన తర్వాత కూడా దొరికే పండ్లు, కూరగాయలను తింటే ఏమవుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిదేనా లేదంటే అనారోగ్యానికి గురవతారా అన్న ప్రశ్నలకు నిపుణులు కొన్ని సలహాలు ఇచ్చారు. లోకల్ మార్కెట్స్ లో సమృద్ధిగా, ఫ్రెష్ గా ఏవి దొరుకుతుంటే అవి తెచ్చుకోవడమే బెటర్ అంటున్నారు. మరి సీజన్‌లో వచ్చే కూరగాయలు, పండ్లు కొన్ని మాత్రమే తెలుసు. అందుకని సీజన్‌ని బట్టి ఏ నెలలో ఏవేం తినాలో వివరంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
జనవరి
కూరగాయలు : వంకాయ, పాలకూర, టమటా, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్, బఠానీ, బ్రకోలీ, కాప్సికం వంటి కూరగాయలు జనవరిలో సమృద్దిగా దొరుకుతాయి.
పండ్లు : స్ట్రాబెర్రీస్, ద్రాక్ష, జామపండు, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్ తింటే మంచిది.
ఫిబ్రవరి
కూరగాయలు : క్యాబేజ్, మెంతి కూర, క్యారెట్, ముల్లంగి, స్ప్రింగ్ ఆనియన్, కాప్సికం, బ్రకోలి తీసుకోవాలి
పండ్లు : సపోటా, కర్బూజా, ద్రాక్ష, కమలా పండు, జామ పండు, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లు మంచిది.
మార్చి
కూరగాయలు : పాలకూర, మెంతి కూర, కాప్సికం, క్యారెట్, దొండకాయ, గుమ్మడి వంటి కూరగాయలు ఎక్కువగా తినాలి.
పండ్లు : పుచ్చకాయ, పచ్చి మామిడి కాయ, తోతాపురి మామిడి, బాదామి మామిడి, ద్రాక్ష, కమలా పండు, పైనాపిల్, అరటి పండు, కర్బూజా, స్ట్రాబెర్రీస్
ఏప్రిల్
కూరగాయలు : బెండకాయ, కీర దోసకాయ, దొండకాయ, కాకరకాయ, బీన్స్, గుమ్మడి, సొరకాయలను ఆహారంగా తీసుకుంటే మంచిది.
పండ్లు : పుచ్చకాయ, పచ్చి మామిడి కాయ, తోతాపురి మామిడి, బాదామి మామిడి, చిన్న రసాలు, బంగినపల్లి మామిడి, ద్రాక్ష, కమలా పండు, పైనాపిల్, అరటి పండు, కర్బూజా, స్ట్రాబెర్రీస్, పనస పండు తింటే మంచిది.
మే
కూరగాయలు : పాల కూర, కీర దోసకాయ, కాకర కాయ, బీన్స్, సొరకాయ కనిపిస్తే కొనుగోలు చేసేయండి.
పండ్లు : పచ్చి మామిడి, ఆల్ఫాన్సో మామిడి, కేసర్ మామిడి, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి మామిడి, బొప్పాయి, నేరేడు పండు, లిచీ, పనస పండు, పుచ్చకాయ, కర్బూజా వీటిని వేసవిలోనే తీసుకుంటే మంచిది.
జూన్
కూరగాయలు : పాలకూర, బెండకాయ, కీర దోసకాయ, కాప్సికం, గెనిసిగడ్డ, అలసందలు, గోరు చిక్కుడు, సొరకాయ ఎక్కువగా తినాలి.
పండ్లు : అల్ఫాన్సో మామిడి, కేసర్ మామిడి
జులై
కూరగాయలు : పాలకూర, బెండకాయ, కీర దోసకాయ, కాప్సికం, చిలగడ దుంప, అలసందలు, గోరు చిక్కుడు, సొరకాయ, పొట్లకాయ, కాకర కాయ
పండ్లు : తోతాపురి మామిడి, కేసర్ మామిడి, పీచ్ పండు, చెర్రీలు, ప్లంస్.
ఆగస్ట్
కూరగాయలు : పాలకూర, బెండకాయ, కీర దోసకాయ, కాప్సికం, గెనిసిగడ్డ, అలసందలు, గోరు చిక్కుడు, సొరకాయ
పండ్లు : అల్ఫాన్సో మామిడి, కేసర్ మామిడి, సీతాఫలం.
సెప్టెంబర్
కూరగాయలు : పాలకూర, బెండకాయ, కీర దోసకాయ, కాప్సికం, చిలగడ దుంప, అలసందలు, గోరు చిక్కుడు, సొరకాయ.
పండ్లు : జామ పండు, బొప్పాయి, దానిమ్మ, సీతా ఫలం.
అక్టోబర్
కూరగాయలు : వంకాయ, టమాటా, స్ప్రింగ్ ఆనియన్స్.
పండ్లు : జామ పండు, బొప్పాయి, దానిమ్మ, సీతా ఫలం.
నవంబర్
కూరగాయలు : వంకాయ, టమాటా, స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్.
పండ్లు : కమలా పండు, ఖర్జూరం, జామ పండు, బొప్పాయి, దానిమ్మ, సీతా ఫలం.
డిసెంబర్
కూరగాయలు : వంకాయ, టమాటా, స్ప్రింగ్ ఆనియన్స్, ముల్లంగి, బీట్రూట్, కంద
పండ్లు : స్ట్రాబెర్రీస్, కమలా పండు, బత్తాయి, జామ పండు, సీతా ఫలం, పైనాపిల్