పంచభూత క్షేత్రాలు

తెలుగు తమిళ ప్రాంతాల్లోని దివ్య జ్ఞానులు తమ ప్రాంతాల్లో పరమేశ్వరుని అనుజ్ఞ ఉన్న ప్రదేశాలను గుర్తించి పంచభూత క్షేత్రాలు గా నిర్ణయించారు.

తమిళనాడులోని చిదంబరం ఆకాశ క్షేత్రంగా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి వాయు క్షేత్రంగా, తమిళనాడులోని తిరువణ్ణామలై అగ్ని క్షేత్రంగా, శ్రీరంగపట్నం కు దగ్గరలోని జంబుకేశ్వరం లో ఉన్న జంబుకేశ్వరం ను జల క్షేత్రంగా, కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయాన్ని భూ లింగ క్షేత్రంగా నిర్ణయించారు. ఈ పంచభూత క్షేత్రాలు దీని ప్రత్యేకత ప్రాముఖ్యం దానివి అని స్పష్టంగా వెల్లడించారు.

  1. చిదంబరం ఆకాశ క్షేత్రం
  2. శ్రీకాళహస్తి వాయు క్షేత్రం
  3. జంబుకేశ్వరం జల క్షేత్రం
  4. కాంచీపురంలోని ఏకాంబరేశ్వరం భూ లింగ క్షేత్రం
  5. తిరువణ్ణామలై అగ్ని క్షేత్రం

ఈ జగత్తులోని సమస్త చరాచర భూత కోటికి ఆరాధ్యుడు, అద్భుత పాలకుడు ఆ పరమేశ్వరుడే గనుక ఆ మహాదేవుని లింగ రూపాలలో ఆయా క్షేత్రాలలో ప్రతిష్టించినట్లు అయితే సమస్య పరిష్కారం అవుతుందని పెద్దలు భావించారు. విశ్వ క్షేమం కోసమై ఆ ఆదిదేవుడు పంచభూతాలను సరళ సవ్య స్థితిలో ఉంచగలరని గ్రహించారు.

అందుకనుగుణంగా పంచభూత క్షేత్రాలలో పంచ లింగ మూర్తులను ప్రతిష్టించారు ఆయా ప్రదేశ పాలకులకు, సంపన్నులకు భక్తజనులకు నచ్చజెప్పి సుందర శోభాయ శక్తి సంపన్న మహిమాన్విత మహత్తర ఆలయాలను నిర్మింపజేశారు.