కావలసిన పదార్థాలు :-
సన్నగా తరిగిన బ్రకోలి: అరకప్పు, గుడ్లు: రెండు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: అరకప్పు, మిరియాలపొడి: అరస్పూన్, పచ్చిమిర్చి తరుగు: ఒక స్పూన్, పాలు: పావుకప్పు, నూనె: కొద్దిగా
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్‌లో బ్రకోలి సహా అన్ని పదార్థాలను వేసి బాగా కలపాలి. చివరగా గుడ్లు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్‌మీద పెనం పెట్టి వేడయ్యాక నూనె వేసి బ్రకోలి మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసి రెండువైపులా బాగా కాల్చుకుంటే చాలు. ఎన్నో పోషకాల బ్రకోలి ఆమ్లెట్ రెడీ.