తుపాను ధాటికి పూడుకుపోయిన ధనుష్కోడి వంతెన తాజాగా బయట పడడంతో.. పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 1914 నుంచి రామేశ్వరం – ధనుష్కోడి మధ్య జాతీయ రహదారి ఉండేది. 1964లో భారీ తుపాను ధాటికి ధనుష్కోడిలోని వినాయక ఆలయం, రైల్వేస్టేషన్‌తో పాటు పలు భవనాలు, నిర్మాణాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అప్పటి నుంచి రాకపోకలు నిలిపివేశారు. 2017లో కేంద్ర ప్రభుత్వం రూ.60 కోట్లతో ధనుష్కోడికి జాతీయ రహదారి నిర్మించగా.. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1964 తుపానుకు పూడుకుపోయిన 20 అడుగుల వెడల్పు, 80 అడుగుల పొడవున జాతీయ రహదారిపై నిర్మితమైన వంతెన ప్రస్తుతం భారీగా వీస్తున్న గాలుల వల్ల ఇసుకకు కోత ఏర్పడి బయటపడింది. వంతెనకు అమర్చిన సిమెంట్ పైపులు, రక్షణ గోడ దెబ్బతినక పోవడం విశేషం.