దివంగత జానకిరామ్ కుమారులైన నందమూరి తారకరామారావు, సౌమిత్రి ప్రభాకర్‌ల పంచెకట్టు కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేళంగిలో పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, అన్న కల్యాణ్‌రామ్ దంపతులు సందడి చేశారు. ఆయన అన్న దివంగత జానకిరామ్ కుమారులకు పంచెకట్టు మహోత్సవానికి సతీసమేతంగా హాజరయ్యారు. వీరితోపాటు తండ్రి హరికృష్ణ దంపతులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. హరికృష్ణ వియ్యంకుడు ప్రభాకర్‌రావు ఇంటి వద్ద వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.