ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత..’ టీజర్‌

‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ అని జగపతిబాబు చెప్తున్న డైలాగ్‌ పవర్‌ఫుల్‌గా, ‘కంటపడ్డానా కనికరిస్తానేమో..వెంటపడ్డావో నరికేస్తావోబా..’ అంటూ తారక్‌ చెప్తున్న డైలాగ్‌తో, తారక్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతున్న  టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. తారక్‌ కత్తి పట్టుకుని పరిగెడుతున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తారక్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో తారక్‌ సంభాషణలు చెప్పబోతున్నారు. తెరపై మరోసారి సిక్స్‌ ప్యాక్‌తో సందడి చేయబోతున్నారు. ఇందుకోసం ఆయన చాలా రోజుల పాటు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేసిన విషయం తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.