శ్రీవాస్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 99వ చిత్రం ‘డిక్టేటర్’. అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలు. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అమరావతిలో వైభవంగా జరిగింది. ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలి సీడీని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవిష్కరించి చిత్ర కథానాయకుడు బాలకృష్ణకు అందించారు.