నటసింహ బాలకృష్ణ ‘అఖండ’ టీజర్‌ విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అంటే ఎన్ని భారీ అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సింహా, లెజెండ్‌ వంటి బ్లాక్‌ బస్టర్స్‌ తర్వాత మూడోసారి వీరి కలయికలో సినిమా అనౌన్స్‌ చేయగానే.. అనౌన్స్‌ చేసిన రోజు నుంచి సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోతూ వచ్చాయి. ఈ అంచనాలను ముందుగానే ఊహించిన మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను మించేలా బాలకృష్ణతో సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశారు డైరెక్టర్‌ బోయపాటి శ్రీను.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. మరో నాయిక పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు.