నయనతార ‘హాయ్’ మూవీ ట్రైలర్ విడుదల..

సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, టాలెంటెడ్ యంగ్ హీరో కవిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్’ (Hi). లిరిసిస్ట్ నుంచి దర్శకుడిగా మారుతున్న విష్ణు ఎడవన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లవ్‌ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

యునిక్ లవ్ స్టోరీ: ట్రైలర్ ఆద్యంతం విభిన్నమైన ప్రేమకథతో ఆకట్టుకుంటుంది. సినిమాలో కవిన్ (మయిల్సామి) పెళ్లి కోసం ప్రయత్నించే నిరాశానిస్పృహల్లో ఉండే ఓ యువకుడిగా కనిపిస్తాడు.

ఈ చిత్రంలో నయనతార చాలా స్టైలిష్‌గా మరియు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలో కనిపించనుంది. కవిన్ ఆమె ప్రేమలో పడటం, ఊహించని పరిణామాల మధ్య ఇద్దరూ వివాహం చేసుకోవాల్సి రావడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ట్రైలర్ సాగుతుంది. ఈ చిత్రంలో భాగ్యరాజ్, ప్రభు, రాధికా శరత్‌కుమార్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మొదట ఆగస్టు మధ్యలో విడుదల కావాల్సిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. జెన్ మార్టిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.