తెలుగోడి వాడిని వేడిని ప్రపంచానికి చాటిచెప్పిన స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రానికి సంబంధించి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ సినీ అభిమానుల దృష్టిని బయోపిక్ వైపుకి తిప్పిన క్రిష్.. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేస్తూ ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.
‘ఘన కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మణిదీపకా ఓ కథానాయకా’.. అంటూ అచ్చ తెలుగు పద బంధాలతో తెలుగోడి గొప్పతనాన్ని వర్ణిస్తూ.. అన్నగారి శైలిని వర్ణిస్తూ సాగిన పాట వీనులకు విందుగా ఉంది. మ్యూజిక్ లెజెండ్ ఎమ్ ఎమ్ కీరవాణి అద్భుతమైన స్వరాలను సమకూర్చగా.. ఆయన తండ్రి శివ శక్తి దత్తా ముత్యాల్లాంటి తెలుగు అమరికలతో సాహిత్యం అందించారు. ఈ పాటలోని ప్రతి పదం అన్నగారి ఔన్నత్యాన్ని చాటి చెప్పేదిగా ఉంది. విలక్షణ గొంతుతో సింగర్ కైలాష్ ఖేర్ ఈ పాటకు ప్రాణం పోశారు. కాగా ఈ చిత్ర తొలి భాగం ‘కథానాయకుడు’ పేరుతో జనవరి 9న విడుదల కానుండగా, రెండో భాగం ‘మహానాయకుడు’ పేరుతో జనవరి 24న విడుదల కానుంది.
Listen to Kathaa Naayaka Full Song With Lyrics from NTR Biopic Starring Nandamuri Balakrishna. #Kathaanaayaka #Kathanayaka #NTRBiopic Listen to Kathaa Naayaka Full Song With Lyrics from NTR Biopic Starring Nandamuri Balakrishna. #Kathaanaayaka #Kathanayaka #NTRBiopic