పూరీ జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలోన ఒరిస్సారాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో బంగాళాఖాతం తీరాన ఉంది.
పూరీ జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలోన ఒరిస్సారాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో బంగాళాఖాతం తీరాన ఉంది. 1078సంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. సంస్కృత భాషలో జగత్ (విశ్వం) మరియు నాథ్ (ప్రభువు) అని అర్థం.
హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు మరియు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన “ఛార్ థాం” పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఇక్కడ రాధా, దుర్గ, లక్ష్మి, పార్వతి, సతి, మరియు కృష్ణ తో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి, పురుషోత్తమ క్షేత్ర, శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.
పూరీ జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కన్పించదు. పగలైనా రాత్రైనా అస్సలు కన్పించదు.
సాధారణం గా ఏ గుడి కైనా కట్టిన జెండా గాలి ఎటు వైపు వీస్తుందో అటు వైపు మాత్రమే ఎగురుతుంది కానీ ఈ ఆలయ గోపురానికి కట్టిన జెండా చాలా ఆశ్చర్యం గా ఉంటుంది గాలి వీచే దిక్కున కాకుండా వ్యతిరేక దిశాలో జెండా రెప రెపలాడుతుంది.ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది ఎవరు కనిపెట్టలేకపోయారు.
గోపురం పైన వుండే ఈ సుదర్శన చక్రం పరమ పవిత్ర మైనది. మీరు పూరి పట్టణం లో ఎక్కడ నుంచి చూసినా కూడా ఈ సుదర్శన చక్రం మీ వైపు తిరిగినట్టు, మీ వైపునే చూస్తునట్లుకనిపిస్తుంది ఇదొక అద్భుతం
పూరీ జగన్నాధ ఆలయంలో 56 రకాల పిండివంటలని దేవుడికి నైవేద్యంగా పెడతారు.ప్రసాదాలు కేవలం ఆలయ వంటశాలలో మట్టికుండలో మాత్రమే తయారుచేస్తారు.ఎలాంటి ఇత్తడి గాని, ఇనుము కానీ మారె ఇతర లోహ పాత్రలని ఉపయోగించక పోవడం ఇంకొక విశేషం